ఈమె వయసు ఎంతో తెలుసా?

284
- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న అందత్తె వయసు ఎంతో తెలుసా?.. ఓ 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందిలే అనుకుంటున్నారా?.. అయితే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఆమె వయసు 70 సంవత్సరాలు. నమ్మశక్యం అయినా కాకపోయినా ఆమె వయసు అక్షరాలా 70 సంవత్సరాలు. ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హర్జ్‌ ఇంటర్‌‌నెట్‌లో పెను సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే అసంఖ్యాకమైన అభిమానులను సొంతం చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

karoline

అందరితోనూ ప్రశంసించబడతున్న ఈ అమ్మమ్మను చూసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు. నమ్మశక్యంగా లేదంటూ ఆశ్చర్యపోతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత అందమైన, సెక్సీయస్ట్ అమ్మమ్మ’ అంటూ పొగుడుతున్నారు. నెటీజన్ల కామెంట్లపై కరోలిన్ స్పందించింది. షుగర్ వ్యాధి రావడంతో 28 సంవత్సరాల నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నానని తెలిపింది. ఈ ఆహారపు అలవాట్ల వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నానని చెప్పింది. మంచి ఆహారం తీసుకుంటే అందాన్ని సొంతం చేసుకోవచ్చంటూ యువతులకు ఓ సలహా కూడా ఇచ్చింది ఈమె..

- Advertisement -