అమరావతి చాలా సేఫ్ సిటీ.. ఇందులో అనుమానం లేదు అన్నారు ఏపీ మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణంలో 13 వేల మంది పని చేస్తున్నారు…. నవంబర్ చివరికి నిర్మాణాలు పూర్తి అయ్యే అవకాశం ఉంది అన్నారు.
వచ్చే నెల గ్రూప్ డిలో ఉన్న నిర్మాణాలు పూర్తి అవుతాయి… రాజధానిపై కొందరు పని గట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు. రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ చైర్పర్సన్ డి.లక్ష్మీపార్థసారథి.
సీఆర్డీఏ భవనం పనులు → ఈ నెలాఖరుకు పూర్తికానుండగా మూడు సంవత్సరాల్లో అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తికానుంది. ప్రధాన భవనం 3 లక్షల చదరపు అడుగులు, అనుబంధ నిర్మాణాలు 1.60 లక్షల చదరపు అడుగులు కాగా దసరా సందర్భంగా భవనం ప్రారంభంకానుంది. వరద నివారణ కోసం రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ పనులు వేగవంతం… ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు మార్చి 2026 నాటికి సిద్ధంకానున్నాయి.
Also Read:ఖైరతాబాద్ బడా గణేశ్..చిన్న రూపంలో

