వైసీపీ క్లారిటీ.. రాజధాని ‘అమరావతే’!

24
- Advertisement -

ఏపీలో రాజధాని అంశం తరచూ హాట్ హాట్ డిబేట్లకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ, జనసేన పార్టీలు డిమాండ్ చేస్తుంటే.. అధికార వైసీపీ మాత్రం పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం చుట్టూ జరిగిన కాంట్రవర్సీ అంతా ఇంతా కాదు. మూడు రాజధానులను ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ గట్టిగానే ప్రయత్నించినప్పటికి.. కోర్టులో కేసు కారణంగా ఆ ప్రతిపాదన హోల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇక అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తున్నట్లు స్వయంగా సి‌ఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేకం. దీంతో రాజధాని ఏదో తెలియక ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి.

ఇకపోతే ఎన్నికల నాటికి రాజధాని అమరావతి నుంచి విశాఖకు మార్చి తీరుతామని ఘంటాపథంగా చెబుతూ వచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు బ్యాక్ టూ అమరావతి అనడం కొత్త చర్చలకు తావిస్తోంది. రాజధాని విషయంలో మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్పందిస్తూ.. ‘ ప్రస్తుతనికీ అమరావతినే రాజధాని అని క్లారిటీ ఇచ్చారు. కోర్టు స్టే తొలగిన తరువాతే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఇన్నాళ్ళు అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు ససేమిరా అన్న వైసీపీ.. సడన్ గా ఇప్పుడు అమరావతినే రాజధాని అని చెప్పడం వెనుక పోలిటికల్ స్ట్రాటజీ ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనతో ఇప్పటికీ కూడా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది వైసీపీ. ఎన్నికల్లో ఈ రాజధాని అంశాన్ని ప్రత్యర్థి పార్టీలు విమర్శనాస్త్రంగా మలుచుకొని వైసీపీని దెబ్బ కొట్టే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వకుండా అమరావతినే రాజధానిగా ఒప్పుకునేందుకు సి‌ఎం జగన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైందనేది కొందరి వాదన. ఏది ఏమైనప్పటికి ఇన్నాళ్ళు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన అధికార వైసీపీ.. ఇప్పుడు అమరావతే రాజధాని అని కొత్త పాట పడడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈ పరిణామాలు ఎలా టర్న్ అవుతాయో చూడాలి.

Also Read:త్రివిక్రమ్ తో గ్యాపే కొంప ముంచింది

- Advertisement -