సిఎం పెళ్లి చేశాను.. ప్రతిఫలం అనుభవిస్తున్నాను !

217
Online News Portal
No photo of Akhilesh's wedding where this dalal is not there
- Advertisement -

ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేశ్‌తో తాను ఉండకపోవచ్చు గానీ.. ములాయం కుమారుడు అఖిలేశ్‌తో మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉంటానని సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్‌ అన్నారు. లఖ్‌నవూలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అఖిలేశ్‌ తనను ‘దలాల్‌’ అని సంభోధించడం చాలా బాధించిందని తెలిపారు. అప్పట్లో అఖిలేష్ తరఫున గట్టిగా నిలబడింది తానొక్కడినేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అతడి పెళ్లి ఫొటోలు చూస్తే.. తాను లేకుండా ఏ ఒక్క ఫొటో కూడా ఉండదని తెలిపారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు తనను ‘దలాల్’ అంటూ వ్యాఖ్యానించడం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తోందని అమర్ సింగ్ చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం అంతా అఖిలేష్ యాదవ్ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే.. డింపుల్‌తో అతడి పెళ్లి తానే చేయించానని అమర్ సింగ్ చెప్పారు. తానే లేకపోతే అఖిలేశ్‌ వివాహం జరిగేదే కాదన్నారు.

akhileshmain

‘ముఖ్యమంత్రి అఖిలేష్’కు తాను సన్నిహితం కాకపోవచ్చు గానీ.. ములాయం కొడుకు అఖిలేష్‌కు మాత్రం తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ అయినా దొరుకుతుంది గానీ అఖిలేష్ అపాయింట్‌మెంట్ మాత్రం దొరకదన్నారు. తన బలితోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే.. బలిదానం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ ఎస్పీ ఛీప్‌గా శివపాల్‌ యాదవ్‌ను నియమించినపుడు కూడా అఖిలేష్‌ తననే విమర్శించాడని అమర్ సింగ్ తెలిపారు. అప్పుడు శివపాల్ యాదవ్ మాత్రం తనను తప్పుబట్టకుండా, కొత్త అధ్యక్షుడైన అఖిలేష్‌ను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారన్నారు. అఖిలేష్‌ను ఔరంగజేబ్‌గా.. ములాయంను షాజహాన్‌గా పిలిచిన శాసన సభ్యుడు అశు మాలిక్‌తో తాను ఎన్నడూ మాట్లాడలేదని సింగ్ వెల్లడించాడు.

ఇక నవంబర్ 3వ తేదీ నుంచి అఖిలేష్ యాదవ్ నిర్వహించనున్న రథయాత్రకు తనకు ఆహ్వానం లేదన్నారు. ఆహ్వానం లేకుండా తాను అక్కడకు వెళ్తే అఖిలేష్ మద్దతుదారులు తన బట్టలు చింపి, కొట్టడం ఖాయమని సింగ్ అన్నారు.

- Advertisement -