‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని’ మూవీ ట్రైల‌ర్..

219
Amar Akbar Anthony
- Advertisement -

శ్రీనువైట్ల దర్శకత్వంలో ర‌వితేజ, ఇలియానా నటిస్తున్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని. ఈ మూవీని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. (‘అఅఅ’) చిత్రం న‌వంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్‌కి కొద్ది రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో దర్శకనిర్మాతలు చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సినిమాలో ర‌వితేజ‌.. అమ‌ర్, అక్బ‌ర్, ఆంటోని అనే మూడు పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పిస్తున్నాడు. సునీల్‌, వెన్నెల కిషోర్, త‌దిత‌రులు ఈ చిత్రంలో నటిస్తుండ‌గా, ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఆరేళ్ల త‌ర్వాత ఇలియానా ఈ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

- Advertisement -