30 ఏళ్ల తర్వాత తమిళంలో అమల..!

252
Amala Akkineni
- Advertisement -

అమల అక్కినేని తెలగు,హిందీ,తమిళ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమల నాగార్జునతో పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైపోయింది. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్యే నటన వైపు దృష్టి పెట్టింది అమల. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో మళ్ళీ నటించలేదు. కొంతకాలం గ్యాప్ తర్వాత ఆ మధ్యలో ఓ హిందీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది అమల. ఇటీవల జీ 5 ఒరిజినల్స్ నుంచి వచ్చిన ఓ వెబ్ సిరీస్ కూడా నటించింది. ఇక తమిళ సినిమాల విషయానికొస్తే.. పెళ్లికి ముందు అమల‘కార్పూరా ముల్లై’తమిళ చిత్రంలో నటించింది. ఆ తర్వత ఇప్పటి వరకూ మళ్ళీ నటించలేదు.

అయితే తాజాగా ఈ అక్కినేని ఇంటి కోడలు ప్రస్తుతం తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటించబోతుంది. ఈ మూవీలో హీరో శర్వానంద్‌కు తల్లిగా నటిస్తున్నది అమల. ఈ చిత్రంలో అమల సరసన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవీంద్రన్‌ తండ్రి రవి రాఘవేంద్ర నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను శర్వానంద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ అయితే అమల 30 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో కనిపిస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -