షూటింగ్‌ స్పాట్‌ నుంచి హీరోయిన్‌ ఎస్కేప్‌..!

250
Amala Paul tries to escape from sets
- Advertisement -

”తిరుట్టుపయలె” సీక్వెల్‌లో బాబి సింహా, ప్రసన్న, అమలాపాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచి హీరోయిన్‌ అమలాపాల్‌ పారిపోయేందుకు ప్రయత్నించిందట.

దీని గురించి సుశీ గణేశన్‌ వివరిస్తూ..థాయ్‌లాండ్ కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో సెల్ ఫోన్ టవర్లు వుండవు. ఆ సమయంలో అమలాపాల్‌ తండ్రికి సీరియస్ అంటూ మెసేజ్ వచ్చింది.

 Amala Paul tries to escape from sets

అయితే అమలా పాల్ తమతో కూడా చెప్పకుండా స్వదేశానికి తిరిగి వెళ్ళేందుకు ప్లాన్ వేసింది. మాతో మాత్రం సెల్ ఫోన్ టవర్ దొరికే ప్రాంతం నుంచి ఫోనులో అమ్మతో మాట్లాడి వస్తానని అసిస్టెంట్‌తో పాటు పడవలో వెళ్ళింది. దీంతో అందరూ షాక్ అయ్యాం. టవర్ దొరికే ప్రాంతంలో నిలబడి అమలా పాల్ వారి అమ్మతో మాట్లాడాకే అసలు విషయం తెలిసిందని చెప్పారు.

 Amala Paul tries to escape from sets

అంతేకాకుండా.. చాలా రోజులుగా అమలాతో మాట్లాడలేదన్న కారణంతో ఆ విధంగా మెసేజ్‌ పంపించినట్టు అమలా తల్లి చెప్పారు. దాంతో ఆమె అమ్మగారు తండ్రికి బాగోలేదని మెసేజ్ పెట్టారని తెలిసింది. ఇక ఆ మాట విన్నాకే అమలా మామూలు స్థితికి వచ్చిందని, అమలాపాల్‌ అమ్మపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందని డైరెక్టర్‌ సుశీ తెలిపారు.

- Advertisement -