వంద కోట్ల సినిమా వదులుకున్న ‘ఆమె’

970
amala paul ame
- Advertisement -

సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ‘ఆమె’.భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. జులై 19న సినిమా విడుద‌ల కానుండగా సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది అమలాపాల్‌. ఈ మూవీ కంటే ముందు మహానటి మూవీ ఆఫర్ వచ్చిందని తెలిపింది. దర్శకుడు నాగ్ అశ్విన్‌ తనకు మొదట మహానటి కథను చెప్పారని కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను వదులుకున్నానని చెప్పుకొచ్చింది.

తాను నగ్నంగా నటించే సన్నివేశాల్లో ప్రత్యేకమైన దుస్తులు ధరించవచ్చునని నిర్మాత అన్నారని, అయితే ఆ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదని చెప్పానని తెలిపింది. ఆమె సినిమా బాగుంటుందని, తప్పకుండా అందరికి నచ్చుతుందని తెలిపింది అమలా పాల్.

సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ బాక్సాఫీస్‌ రికార్డులను చెరిపేసింది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి బయోపిక్‌ సినిమాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

- Advertisement -