ఆమె సినిమాతో దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారింది అమలాపాల్. గతంలో దర్శకుడు ఎఎల్ విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ ఆ తర్వాత కొన్నేళ్లకు విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. అయితే ఈసారి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని బాయ్‌ఫ్రెండ్‌గా ఎంపిక చేసుకుంది.
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది అమలాపాల్. ఆమె సినిమా ప్రమోషన్‌లో భాగంగా పెళ్లి , కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను భయటపెట్టింది. తాను ప్రేమలో ఉన్నానని చెప్పారు. ఆయన సినీ పరిశ్రమకు చెందినవారు కాదని వెల్లడించారు. అయితే, తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు.
2014లో విజయ్, అమలాపాల్ వివాహం జరిగింది. మూడేళ్లపాటు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2017లో విడాకులు తీసుకున్నారు. ఇటీవల డాక్టర్ ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు విజయ్ .