అందుకే విడిపోయా..

245
- Advertisement -

ఈ ఏడాది ఇండస్ట్రీలో విడాకుల పరంపర బాగానే కొనసాగింది. మనస్పార్ధాలు, విభేదాలతో సినీతారలు తమ వైవాహిక దాంపత్య జీవితానికి విడాకులతో పుల్ స్టాప్ పెట్టేశారు. మలయాళ బ్యూటీ అమలా పాల్‌..దర్శకుడు విజయ్‌తో విడాకులు తీసుకుంది. అలాగే రజినీకాంత్ చిన్న కూతురు కూడా భర్తతో వేరు పడింది. రీసెంట్‌గా కమల్ హాసన్‌..గత పదిహేన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న గౌతమి కు గుడ్ బై చెప్పేశాడు. అయితే వీళ్లంతా విడాకులు తీసుకోవడానికి ఒక్కోక్కరిది ఒక్కో కారణం. విడాకులపై అమలాపాల్ మొదటి సారిగా పెదవి విప్పింది.

Amala-Paul
‘విడాకులు తీసుకోవాలని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత బాధాకరమైన, క్లిష్టమైన నిర్ణయం (విడాకులు తీసుకోవాలనుకోవడం) అది. నేనిప్పటికీ విజయ్‌ను ప్రేమిస్తున్నా. ఎప్పటికీ ప్రేమిస్తా’’ అన్నారు అమలాపాల్. ‘‘18 ఏళ్లకు కథానాయిక అయ్యా. 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. ఏడాది తిరగక ముందే విడిపోవాలనుకున్నా. ఆ టైమ్‌లో నాకు సలహాలు ఇచ్చేవారు లేరు. విజయ్‌ను పెళ్లి చేసుకోవడం ఒప్పా? తప్పా? అనడిగితే.. చెప్పలేను. కానీ, ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తప్పే. ఎర్లీ ట్వంటీస్‌లో పెళ్లి చేసుకోకూడదు. నేనెవర్నీ నిందించడంలేదు. బాధపడడం లేదు. జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం’’ అని అమలాపాల్ వ్యాఖ్యానించారు.

Amala paul

పెళ్లైయ్యాక సినిమాల్లో నటించకూడదు అన్న భర్త నిర్ణయం….అమలాపాల్‌కు నచ్చక పోవడం విడాకులకు ఓ కారణంగా చెప్పోచ్చు. అలాగే అమలాపాల్ భర్త విజయ్‌ ప్రవర్తన అమ్మడుకు నచ్చక పోవడం మరో కారణంగా జోరుగా వార్తలు వచ్చాయి. ఏదైమైనా తొందరపడి పెళ్లి చేసుకున్నాను ..అంతే తొందరపడి విడాకులు తీసుకున్నానంటూ అమ్మడు బాధపడుతోంది. వ్యక్తి గత పరంగా అమలా జీవితం ఎలాగున్నా..సినిమాల్లో అయితే బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమలాపాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

- Advertisement -