- Advertisement -
హైదరాబాద్ సెవెన్ టూంబ్స్, డెక్కన్ పార్క్ లో ఓటర్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీనటి అక్కినేని అమల హజరైయ్యారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఎన్నికల అధికారి దాన కిషోర్, జోనల్ కమిషనర్ హరిచందన, సంయుక్త ఎన్నికల అధికారి రవి కిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నటి అమల మాట్లాడుతూ.. ఓటు హక్కు మాత్రమే కాదు, ఓటు వేయడం మన కర్తవ్యం కూడా అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మంచి ప్రభుత్వం అధికారంలోకి రావాలి..అందుకే అందరు ఓటు వేయాలి. ఈ ఎలక్షన్‌లో నాగార్జున, నేను 7 గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తాం అని అన్నారు.
- Advertisement -

