ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ అతని భార్య మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. షమీ భార్య హసీన్ జహాన్ కఠువా అత్యాచార ఘటనపై కోల్‌కతాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె తనపై జరుగుతున్న వివాదం గురించి చెప్పకుంది. నన్ను కూడా షమీ, అతని కుటుంబం సభ్యులు తీవ్రంగా నన్ను హింసించారని నాది కఠువా కేసులాంటిదేనని అన్నారు.
ఆమె కఠువా ఘటనపై స్పందిస్తూ ..కఠువా నిందితులను కఠినంగా శిక్షించి బాదితులకు సరైన న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కఠువా కేసులాగే నన్ను కూడా అత్యాచారం చేసి చంపి బావిలో పడేయాలని చూశారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కఠువా కేసులో బాలిక చనిపోయింది నేను బతికాను అంతే తేడా అిని ఆమె తెలిపారు. తనకు జరుగుతున్న ఈ అన్యాయం గురించి షమీతో పాటు అతని కుటుంబసభ్యుల మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నానని ఆమె తెలిపారు. ఆమె ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా ఆమె కలిశారు. షమీపై హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన కుటుంబ కోసం రూ.7లక్షలు, కూతురి కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది.