కలబందతో మొటిమలకు చెక్!

2
- Advertisement -

ప్రకృతి సిద్దంగా లభించే మొక్కల్లో ఒకటి కలబంద. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాదు చర్మ సమస్యలు ప్రధానంగా మొటిమలకు మంచి సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఆలోవెరాను వివిధ రకాల చర్మ సంబంధిత మెడిసన్స్ లో వాడుతుంటారు. గ్లిసరిన్, సోడియం ఫామాల్, సోడియం కార్బొనేట్, ఫామ్ కెమెలెట్ సర్బిటోల్ వంటి గుణాలను కల్గి ఉంటుంది. ఇవన్నీ కూడా వివిద రకాల చర్మ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే చర్మ సమస్యలకు సంబంధించి ఏ మెడిసన్ తీసుకున్న అందులో ఆలోవెరా కారకాలు కచ్చితంగా ఉంటాయి.

వేసవిలో మొఖం పాలిపోవడం, నల్ల మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలతో కూడా భాద పడుతుంటారు చాలామంది. అలాంటి సమస్యలకు కూడా ఆలోవెరా ఒక చక్కటి పరిష్కారం. ఆలోవెరా లోని గుజ్జును పేస్ట్ ల మొఖానికి అప్లై చేయడం వల్ల మొఖం నిగారింపును సొంతం చేసుకోవడంతో పాటు నల్ల మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోతాయి.

మొటిమల సమస్య జిడ్డు చర్మతత్వం ఉన్న వారు కలబంద ఆకుల్ని నీళ్లలో కాసేపు మరిగించి దాన్ని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొన్ని చుక్కల తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:విటమిన్ లోపం.. తప్పక తెలుసుకోండి!

గాయాల వల్ల చర్మంపై ఏర్పడే మచ్చలను పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కలబంద గుజ్జులో కాస్త రోజ్‌వాటర్ వేసి బాగా కలపుకోవాలి. ఆ మిశ్రమాన్ని శరీరంపై ఉన్న మచ్చలపై అప్లై చేసి అలాగే 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణలు సూచిస్తున్నారు.

NOTE : ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు న్న వైద్యులను సంప్రదించాల్సిందే.

- Advertisement -