నెలాఖ‌రున `అల్లుడు సింగం`

276
Alludu Singam Telugu movie
- Advertisement -

స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `అల్లుడు సింగం`. రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ ` విడుద‌ల చేస్తున్నారు.

Alludu Singam Telugu movie

షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన అంజలి తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంది. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతో్న్న‌ “అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని రెండు డిఫ‌రెంట్ రోల్స్ లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా క‌న‌ప‌డనుంది. అంజ‌లి చేసిన రెండు షేడ్స్ సినిమాకు పెద్ద హైలైట్ కానుంది.

Alludu Singam Telugu movie

ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్ర‌స్తుతం సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ నెలాఖ‌రున విడుల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌జేశారు.

Alludu Singam Telugu movie

ఈ చిత్రానికి సంగీతంః ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్‌, మాట‌లుః వెంక‌ట్‌, నిర్మాతః రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడుః రాజ‌శేఖ‌ర్‌

- Advertisement -