సౌత్ సూపర్‌స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, నటుడు అల్లు శిరీష్ తన వివాహ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆయన నయనిక రెడ్డితో మార్చి 6, 2026న సన్నిహిత కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెడతానని తెలిపారు.
నయనిక & నేను మార్చి 6న కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సాదాసీదా వివాహం చేసుకుంటున్నాం. మార్చి 2న హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో తెలుగు సినీ పరిశ్రమ సభ్యులతో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరుపుకోబోతున్నాం అన్నారు.
ఇప్పటికే ఈ జంట దుబాయ్‌లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు నిర్వహించగా, అల్లు అర్జున్ సహా సన్నిహితులు హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన నయనిక రెడ్డి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.
Also Read:ఒత్తిడితో పురుషుల్లో సంతానోత్పత్తి సమస్య..!
అల్లు శిరీష్ 2025 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వృత్తిపరంగా ఆయన ‘గజినీ’, ‘ఒక్క క్షణం’, ‘బడ్డీ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.

