‘అల వైకుంఠపురంలో’ అల్లు అర్జున్ మాసీ లుక్‌..

601
allu arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.

‘అల వైకుంఠపురంలో’ ని ఇటీవల విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’ విశేష ఆదరణకు నోచుకుంది. ఈ పాటకు విడుదలైన వారంలోనే 20 మిలియన్ వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి. ఇక దసరా పండగ సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో మాసీ లుక్ కనిపిస్తున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Ala Vaikunthapurramulo

దసరా కానుకగా విడుదల చేసిన ఈ ప్రచార చిత్రానికి ఫాన్స్ అందరు ఫిదా అవటమే కాకుండా ట్రేడ్‌లో సూపర్ బజ్ తీసుకొచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యా క్షన్ లుక్‌లో కూడా ఒక కథని చెప్పేవిధంగా పోస్టర్ విడుదల చేయటం గమనించదగ్గ విషయం. ఈ సందర్భంగా ప్రేక్షకాభిమానులందరికీ చిత్ర యూనిట్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘అల వైకుంఠపురములో” ని తారలు.. సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

- Advertisement -