మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సైరా. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈమూవీ అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా చిత్రయూనిట్ ఈమూవీ ప్రమోషస్స్ లో చాలా బిజీగా ఉన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈమూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈమూవీపై చాలా మంది హీరోలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ స్టాగ్రామ్ ద్వారా సైరా చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో ఇప్ప గొప్ప చిత్రాన్ని నిర్మించిన నా బావ రామ్ చరణ్ కు అభినందలు తెలుపుకుంటున్నాను.. ఈ సినిమా చూసిన తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డిపై గౌరవం రెట్టింపైంది. ఒక తండ్రికి కుమారుడు ఇచ్చే గొప్ప బహుమతి ఈసినిమా అన్నారు.
సైరా చిత్రయూనిట్ కు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట చేశారు. ఈమూవీలో బిగ్ బి అమితాబ్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ , నిహారిక పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈమూవీని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్సాస్ వస్తుంది.