అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి,జులాయి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ నేపధ్యంలో వీరి కాంబోలో మరో మూవీ అనౌన్స్ కావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నా పేరు సూర్య యావరేజ్ మూవీగా నిలవడంతో మరోసారి త్రివిక్రమ్‌తో మూవీకి కమిట్ అయ్యారు బన్నీ.
వాస్తవానికి ఈ సినిమా గత అక్టోబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా త్రివిక్రమ్ చెప్పిన కథకు కొన్ని మార్పులు చూపించాడట బన్నీ. అంతేగాదు ఈ సినిమా కోసం లుక్ మారుస్తానంటూ షూటింగ్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారట అల్లు అర్జున్.
అయితే త్రివిక్రమ్ మాత్రం తాను రాసుకున్న స్క్రిప్ట్‌కే ఫిక్సయ్యాడట. ఎందుకంటే త్రివిక్రమ్ కథ,సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఎక్కువ సమయం తీసుకోడు. ఇక తాను రాసుకున్న కథ విషయంలోనూ మార్పులు చేసేందుకు ఇష్టపడడు త్రివిక్రమ్. అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ చెప్పిన కథకు కన్వినెయిన్స్ కాలేదట. సో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో అసలు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు టీ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది.