అల్లు అర్జున్‌తో జాహ్నావి!

5
- Advertisement -

బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కుమార్‌…ఐకాన్ స్టార్ అర్జున్ తో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నటీనటుల వివరాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా జాహ్నవి కపూర్ పేరు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే కొద్ది రోజుల్లో ఆమె చేరికపై మేకర్స్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశముంది.

ఈ ప్రాజెక్ట్ ఖరారైతే, తెలుగు సినిమాల్లో అల్లు అర్జున్‌తో కలిసి జాన్వీ కపూర్ నటించే భారీ అవకాశంగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో దీపికా పదుకొణే నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో సినిమాలను తెరకెక్కించడంలో పేరుగాంచిన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

- Advertisement -