ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తున్నా..

247
lovers day audio launch
- Advertisement -

ఫిబ్రవరి 14 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఒరు ఆదార్ ల‌వ్ మలయాళ చిత్రంలో క‌న్నుకొట్టే సన్నివేశంతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ప్రియా వారియర్. ఈ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్ర‌వ‌రి 14వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హైద‌రాబాద్ జె ఆర్ సి క‌న్వేన్ష‌న్ సెంట‌ర్‌లో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్ ..లవర్స్ డే నాకు ఫేవరేట్ డే. నా వయసు 14 ఏళ్లప్పుడు నాకు ఫిబ్రవరి 14 లవర్స్ డే అని ఎవరో చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రతి ఫిబ్రవరి 14ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నా. నా బర్త్ డే కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో.. ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తున్నా అంటూ ప్రియా వారియర్ కన్నుగీటే మ్యూజిక్‌కి ఆమె లాగే షూట్ చేసి ఉత్సాహ పరిచారు బన్నీ.

 lovers day  audio launch

తనకు సౌత్ ఇండియా అంటే చాలా పిచ్చి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా అన్నీ ఇష్టమే. నా ప్రొఫెషన్ ఏంటీ అంటే సౌత్ ఇండియన్ యాక్టర్ అని రాసుకుంటా అందులో ఎలాంటి మొహమాటం లేదని చెప్పుకొచ్చారు. తనను మలయాళం సినిమా వాళ్లు ఎంతో ఆదరించారు. నా ప్రతి సినిమాని వాళ్ల సొంత సినిమా లాగ వెల్కమ్ చెప్పారని అందుకే వాళ్లని ఎంకరేజ్ చేయడానికి ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యాయని తెలిపారు.

- Advertisement -