పుష్పరాజ్.. తగ్గేదేలే-సీఎం ముందే!

9
- Advertisement -

పుష్పరాజ్.. తగ్గేదేలే.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి ముందు బన్నీ డైలాగ్ కొట్టాడు. గద్దర్ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ యాక్టర్ గా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న అల్లు అర్జున్…గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.

ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టినందుకు థ్యాంక్యూ…. మా రేవంత్ రెడ్డి అన్నగారికి థ్యాంక్యూ అన్నాడు. నా డైరెక్టర్ సుకుమార్ లేకుండా ఇది పాజివుల్ అవ్వదు… ఇది నీ కష్టం. నా నిర్మాతలకు, నాతో పనిచేసిన అందరికి, పుష్పకి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.

రాజమౌళికి స్పెషల్ థ్యాంక్స్….. ఆయన ఆ రోజు హిందీలో సినిమా రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు, పుష్ప 2 కి నాకు వచ్చిన మొదటి అవార్డు ఇది. అందుకే ఇది నాకు చాలా స్పెషల్ అన్నారు. తన ప్రసంగం చివరలో . జై తెలంగాణ జై హింద్ అని చెప్పి చివర్లో పుష్ప 2 సినిమా నుంచి డైలాగ్ చెప్పారు.

Also Read:ఘనంగా గద్దర్ అవార్డ్స్…ప్రధానోత్సవం

- Advertisement -