గంగోత్రి @18.. బన్నీ ట్వీట్‌..

832
Gangotri
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి ఈరోజుతో 18 ఏళ్లు పూర్త చేసుకుంది. ఈ మూవీ 2020 మార్చ్ 28కి స‌రిగ్గా 18 ఏళ్లైంది. 2003.. మార్చ్ 28న విడుద‌లైంది ఆ సినిమా. ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయింది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు వందో మూవీగా తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించిన సినిమా గంగోత్రి. ద‌ర్శ‌కేంద్రుడి చేతుల మీదుగా అశ్వినీద‌త్ ఆశీస్సుల‌తో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్.

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. నా తొలి చిత్రం విడుద‌లై నేటితో 18 ఏళ్లు అయింది. నా 18 ఏళ్ల జ‌ర్నీలో నాతో క‌లిసి పని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. కృత‌జ్ఞ‌తాభావంతో నా హృద‌యం నిండిపోయింది. ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ఈ ప్రేమ‌కు నేను ధ‌న్యుడిని అంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -