చంచ‌ల్‌గూడ‌ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్

3
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు రాగా పోలీసు ఎస్కార్ట్ వాహనం ద్వారా తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ ఉన్నారు.

పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలు, రూ.50వేల పూచీకత్తును శుక్రవారం రాత్రి జైలు సూపరింటెంటెండ్ అందజేశారు. అయితే, శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందడంతో అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ వాయిదా పడింది. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

Also Read:అల్లు అర్జున్‌కు రిలీఫ్.. బెయిల్ మంజూరు

- Advertisement -