టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు బర్త్‌డే సందర్భంగా బిగ్ సర్‌ప్రైజ్ లభించింది. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. విడుదలైన టైటిల్ లుక్ ‘రాకా’పోస్టర్‌లో బన్నీ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉండటంతో, సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ లుక్‌లో అల్లు అర్జున్ స్టైలిష్‌గా, అలాగే కొంచెం రఫ్ & మాస్ టచ్‌తో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌ను విపరీతంగా షేర్ చేస్తూ, సినిమాపై భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందం ఇంకా కథ, ఇతర నటీనటుల వివరాలను రహస్యంగా ఉంచినప్పటికీ, అట్లీ స్టైల్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?

