‘పుష్ప’ ట్రైలర్‌.. అభిమానులకు తీవ్ర నిరాశ..!

138
Allu Arjun Pushpa
- Advertisement -

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకుక్కుతున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ‘పుష్ప ది రైజ్’ పేరిట తొలి భాగం విడుదలకు ముస్తాబవుతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో ట్రైలర్ రిలీజ్ చేయలేకపోతున్నామని పుష్ప యూనిట్ వెల్లడించింది.

ముందుగా ప్రకటించినట్టు 6.03 గంటలకు ట్రైలర్‌ను అభిమానుల ముందుకు తీసుకురాలేకపోతున్నామని, ఆలస్యానికి మన్నించాలని కోరింది. త్వరలోనే ట్రైలర్ తో అభిమానుల ముందుకు వస్తామని పుష్ప యూనిట్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కాగా, ట్రైలర్ వస్తుందని ఎంతో ఉత్సాహంతో ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ స్పందనలను ట్వీట్ల రూపంలో కురిపించారు.

- Advertisement -