ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది నటించిన పుష్ప ది రైజ్ మూవీ ఏ అంచనాలు లేకుండా ఏ ప్రమోషన్స్ లేకుండా బాక్సాఫీస్ దగ్గర కాసుల కనకవర్షం కురిపించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఒక్క పుష్పతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బన్నీ తాజాగా న్యూయార్క్ లో నిర్వహించిన 40వ ఇండియా డే పరేడ్‌లో పాల్గోన్నారు. భార్య స్నేహా రెడ్డితో కలిసి ఆదివారం ఈవేడుకల్లో పాల్గోన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరేడ్‌లో అల్లు అర్జున్ భారతదేశ గొప్పతన్నాన్ని వివరించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ జాతీయ జెండాను పట్టుకొని యే భారత్ కా తిరంగా హై… కబీ ఝుకేగా నహీ అంటూ పుష్ప డైలాగ్ చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఝూకేగా నహీ అంటూ కేరింతలు కొట్టారు. అనంతరం న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఆడమ్స్ బన్నీకి సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నేషన్ బహుకరించారు.
ప్రస్తుతం బన్నీ పుష్ప2 కోసం సిద్దమవుతున్నారు. బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఆ స్థాయిలో పుష్ప విజయం సాధించింది. కేవలం హిందీ బెల్ట్‌లో 100కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇప్పటికే ఈ చిత్రంలోని డైలాగ్‌లు పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఝుకేగా నహీ అనే డైలాగ్‌ను ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకునుగుణంగా వాడుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు క్రికెటర్లు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అందరూ వాడుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప2 ది రూలింగ్ పార్ట్ మూహార్తం చేశారు. కాగా సెప్టెంబర్15 నుంచి ఈసినిమా సెట్స్‌పైకి వస్తుందని సినీ వర్గాల టాక్..