సంధ్య థియేటర్‌ ఘటనపై బన్నీ

4
- Advertisement -

హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు.

రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనతో నా హృదయం ద్రవించింది. ఈ విషాదభరిత సమయంలో రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆ కుటుంబం ఒంటరి కాదు.. ఈ బాధాకర సమయంలో నేను ఆమె కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తాను. వారికి అన్ని రకాలుగా సాయం చేస్తాను అని చెప్పారు.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -