క్రిష్‏తో బన్నీ మరో సినిమా..?

256
Allu Arjun Next Movie Confirmed With Top Director Krish..?
- Advertisement -

అల్లు అర్జున్..టాలీవుడ్ లో ఇయనొక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మాస్ మసాల సినిమాలలో నటిస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా తెరక్కెక్కుతున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ . ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రం తర్వాత బన్నీ ఇంకా ఏ సినిమాను చేస్తున్నాడనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కాకపోతే ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun Next Movie Confirmed With Top Director Krish..?

గతంలో క్రిష్, బన్నీ కలయికతో వచ్చిన చిత్రం వేదం. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించనప్పటికి ప్రత్యేక గుర్తింపును మాత్రం మూటగట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క, అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక క్రిష్ విషయానికొస్తే ప్రస్తుతానికి బాలీవుడ్ చిత్రం మణికర్ణిక షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అనంతరం బన్నీతో కొత్త చిత్రాన్ని పట్టలెక్కించనున్నారు.

- Advertisement -