అల్లు అర్జున్ ఐకాన్ లో రాశి ఖన్నా

343
Allu Arjun Rashi Kanna
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డె నటించగా.. నవదీప్, అక్కినేని సుశాంత్ కీలక పాత్రల్లో నటించనున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని సంస్ధలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇక ఈసినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో పనిచేయనున్నాడు. ఈసినిమాకు ఐకాన్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాలో బన్నీ సరసన నటించేందుకు సరైన హీరోయిన్ గురించి వెతుకుతున్నారట చిత్రయూనిట్.

తాజా సమాచారం ప్రకారం ఐకాన్ లో బన్నీ సరసన హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ తో షూటింగ్ పూర్తి కాగానే వేణు శ్రీరామ్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడట బన్నీ.

- Advertisement -