దువ్వాడ జగన్నాథం అందించిన విజయంతో మంచి జోష్ మీదున్న బన్నీ…తాజాగా నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా తాజా చిత్రయూనిట్ బన్నీ కొత్తలుక్‌ని విడుదల చేసింది.
బుల్లెట్‌పై కూర్చొని సిగరేట్ తాగుతున్న బన్నీ…నయా లుక్‌లో అదుర్స్ అనిపిస్తున్నాడు. ఆర్మీ యూనిఫాంలో బన్నీ స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకోనుంది.
ఇక ఇప్పటికే చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్న యూనిట్ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఆడియో వేడుక జరగనుందని వార్తలు వెలువడుతున్న ప్లేస్ మాత్రం కన్ఫామ్ కాలేదు. హైదరాబాద్,వైజాగ్‌లో నిర్వహించాలన్న సందిగ్దంలో ఉన్నట్లు తెలుస్తోంది. రంగస్థలం వేడుకను వైజాగ్‌లో నిర్వహించగా సినిమా బంపర్ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుక కూడా ఇక్కడే నిర్వహించింతే సెంటిమెంట్ పరంగా కలిసివస్తుందని భావిస్తుండగా మరికొంతమంది మాత్రం తిరుపతి లేదా కర్నూల్లో నిర్వహిస్తే బాగుంటుందని సజేషన్ ఇస్తున్నారట. ఓవరాల్‌గా మెగా కాంపౌండ్ నుంచి మరోసినిమా రానుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.