వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ పాటను కూడా పూర్తిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఒక రోజు అదనంగా కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉండటంతో ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కిక్ స్టార్ట్ చేసేలా డిసైడ్ అయ్యారని టాక్. అయితే ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టుగా సమాచారం.
కాని ఎక్కడ నిర్వహించాలి అనే దాని గురించి మాత్రం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. రంగస్థలం వైజాగ్లో చేశారు కనక మళ్ళి అక్కడే నిర్వహిస్తే ఇతర ప్రాంతాల మెగా ఫాన్స్ వివక్ష అనుకునే అవకాశం ఉంది. పోనీ హైదరాబాద్ అంటే రొటీన్ అయిపోతోంది కాబట్టి వినూత్నంగా రాయలసీమ ప్రాంతాల్లో చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు టాక్. అలా జరిగే పక్షంలో తిరుపతి లేదా కర్నూల్ చేయాలని భావిస్తున్నారట నిర్మాతలు అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్గా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ మే 4 రిలీజ్ చేయనున్నారు.