నాగబాబుతో అల్లు అర్జున్ భేటి…

5
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబును కలిశారు నటుడు అల్లు అర్జున్. నిన్న చిరంజీవిని కుటుంబ సభ్యులతో కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సాయంత్రం నాగబాబును కలిశారు బన్నీ. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎన్‌ మీడియా ద్వారా తెలియజేశారు నాగబాబు.

గత ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతకు బన్నీ ప్రచారం చేసిన దగ్గర్నుంచి జనసైనికులు, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్ కూడా విమర్శలు చేశారు. దీనికంటే ముందు ఓ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అనేటప్పటి నుంచే ఈ గొడవ ఉన్నా ఎన్నికల అప్పుడు మాత్రం కొంచెం ముదిరి పాకాన పడగా అల్లు అర్జున్‌ అరెస్ట్ తర్వాత విభేదాలు అన్ని పోయి మెగా, అల్లు ఫ్యామిలీ అంతా కలిసిపోయారు.

 

Also Read:డైరెక్ట‌ర్సే నాకు గురువులు :అజ‌య్ అర‌సాడ‌

- Advertisement -