మాలీవుడ్‌లో బన్నీమార్క్!

4
- Advertisement -

ఇటీవ‌లే పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరిక‌ల్ సాంగ్‌తో ప్ర‌పంచ‌వ్యాప్త శ్రోత‌ల‌ను అల‌రించి.. యూట్యూబ్ వ్యూస్‌లో ఆల్ టైమ్ రికార్డులు నెల‌కొల్పిన పుష్ప‌-2 ది రూల్‌లోని పుష్ప‌రాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంత‌టా మారుమోగుతూనే ఉంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా కన్నడ రైట్స్ కి సంబంధించి ఓ వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది. కన్నడ హక్కులే రూ.32 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది.

మొత్తానికి పుష్ప 2 రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్‌ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

 Also Read:జగన్ ఫ్లోర్ లీడర్‌ మాత్రమే:పయ్యావుల

- Advertisement -