సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని నిరూపించుకున్నాడు అల్లు అర్జున్. తన దృష్టికి వచ్చిన ఓ సమస్య పట్ల పెద్ద మనసుతో స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన నాగరాజు, దుర్గా ప్రశాంతిలకు 7 నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అభిమానుల ద్వారా ఈ విషయం బన్నీకి తెలియడంతో… వెంటనే అతను స్పందించాడు. తన వంతుగా రూ. 8 లక్షల సాయం చేశాడు. మరోవైపు, ప్రభుత్వం నుంచి కూడా కొంత డబ్బు రావడంతో, ఆ చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ ను నిర్వహించారు. తమ చిన్నారి ప్రాణాలకు కాపాడిన అల్లు అర్జున్ కు నాగరాజు, దుర్గలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆపదలో ఉండి సహాయం కోరి వచ్చిన వారికి,,ఆనారోగ్యంతో బాధపడుతు,,తనను చూడాలని ఆశపడిన వారిపై మన టాలీవుడ్ హీరోలు పెద్ద మనసుతో స్పందిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్, తారక్, రామ్ చరణ్, బన్నీ ఇలా చాలా మంది హీరోలు.. సహాయం కోరిన వారికి చేయూతనందించేందుకు ముందుకు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే. ఇలాంటి సేవా కార్యక్రమాలతో తోటివారి పట్ల ప్రేమను కనబర్చితే,, హీరోలపై ప్రేక్షకులకు అభిమానం ఇంకాస్త రెట్టింపు అవుతోంది. ఏదైమైనా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మిగతా హీరోలు పూనుకుంటే,,సమాజంతో పాటు ఇండస్ట్రీ కూడా పది కాలాల పాటు చల్లగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. మొత్తానికి అల్లు అర్జున్,,,చిన్నారి అనారోగ్యానికి చలించి,,చికిత్సకోసం పెద్ద మొత్తంలో 8 లక్షలు ప్రకటించడం గర్వించదగ్గ విషయం.