‘అది చాలా తప్పు’ పవన్‌ విషయంలో బన్నీ కామెంట్..

256
- Advertisement -

‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ మూవీ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలట్రీ మాధవరం గ్రామంలో ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలో స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ఈ రోజు పవన్‌ కళ్యాన్‌ గురించి మాట్లాడే వెళ్తానని చెప్పాడు. తనకు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే..తనకు బాగా మాట్లాడాలని అనిపించాలని అలాంటప్పుడు మాత్రమే మాట్లాడతానని అన్నాడు.

Allu Arjun Full Speech @ Naa Peru Surya Audio Launch

పవన్ నెంబర్‌1 హీరో అని, అలాంటి వ్యక్తి ఏసీ రూమ్‌లలో కూర్చొని హాయిగా మతకొచ్చు..కానీ అన్నింటినీ వదిలేసి జనంలోకి, ఎండలోకి వచ్చారని అన్నాడు. ఏదో కెరీర్‌ అయిపోయిందనే సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారని, పవన్ అలాకాదని చెప్పాడు. నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకొని వచ్చాడని గుర్తు చేశాడు బన్నీ.

పవన్ పై కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అప్పట్లో చిరంజీవిపై కూడా విమర్శలు వచ్చాయని అన్నాడు. అయితే మొన్న మాత్రం చాలా పర్సనల్‌గా మాట్లాడారని అన్నాడు. ”చాలా చాలా చాలా తప్పు.. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్లది తప్పు, ఈ మాట లక్షల మందికి చూపించారు వాళ్లది పెద్ద తప్పు.. ఆ విషయం నాకు నచ్చలేదు” అంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు బన్నీ.

- Advertisement -