పాయల్ కోసం బన్నీ వస్తాడా?

32
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. ప్రస్తుతం ఈ బ్యూటీ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన థ్రిల్ల‌ర్ మూవీ మంగ‌ళ‌వారం సినిమాతో హీరోయిన్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. న‌వంబ‌ర్ 17న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 11న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఐతే, ఈ ప్రీరిలీజ్‌ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. నిజంగా బన్నీ వస్తే.. ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయి.

ఇక ‘మంగళవారం’ మూవీ ప్రచారంలో భాగంగా పాయల్ రాజ్ పూత్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక ముచ్చట్లను చాలా ఘాటుగా చెప్పేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పూత్ మాట్లాడుతూ.. ‘నేను నా స్కూల్‌ డేస్‌ లోనే ఓ అబ్బాయిని చాలా ఘాడంగా ప్రేమించాను. నా ప్రేమను వ్యక్తం చేయగా అతను మాత్రం నన్ను రిజెక్ట్‌ చేశాడు. ఆ సమయంలో అతని కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. అతనికి రొమాన్స్ కూడా ఆఫర్ చేశాను. కానీ ఎందుకో అతను మాత్రం నన్ను పట్టించుకోలేదు’ అంటూ పాయల్ రాజ్ పూత్ చెప్పుకొచ్చింది.

పాయల్ రాజ్ పూత్ తన ప్రేమ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ బాధతో నేను చదువుపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. ఇదే విషయం మా అమ్మకు చెప్పి ఏడ్చేశా’ అంటూ నాటి సంగతులు చెప్పారు. మరి పాయల్ రాజ్ పూత్ ప్రేమను రిజెక్ట్ చేశాడు అంటే.. అతగాడికి అందం విలువ తెలియదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అన్నట్టు వచ్చే ఏడాది పాయల్ రాజ్ పూత్ పెళ్లిపీటలు ఎక్కనున్నారట. ఈ మధ్యనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ కి క్లారిటీ కూడా ఇచ్చింది అని తెలుస్తోంది.

Also Read:తిరుగులేని టీమిండియా..నెంబర్ వన్!

- Advertisement -