న‌మ్మాలా, వ‌ద్దా?.. మీమాంశ‌లో అల్లు అర్జున్

38
- Advertisement -

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేయాల‌ని బన్నీ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడు. మురగదాస్ కూడా అల్లు అర్జున్ పిలుపు కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. ఆ మధ్య వీరిద్ద‌రి మ‌ధ్యా క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ `పుష్ప‌` రెండు భాగాలు అవ్వ‌డం వ‌ల్ల‌… ఈ కాంబో ఆల‌స్య‌మవుతూ వచ్చిదని. పుష్ప 2 హిట్ట‌యితే.. మురుగదాస్ తో సినిమా ఫిక్స‌యిపోవాల‌ని అల్లు అర్జున్ ఆ మధ్య డిసైడ్ అయ్యాడని టాక్. మరి ఏమైందో ఏమో.. ఆ తర్వాత ఈ కాంబినేషన్ పై ఎలాంటి సమాచారం లేదు. ఓ వైపు మురుగదాస్ మాత్రం కథ రెడీ చేసి పెట్టుకున్నాడు.

ఆలు అర్జున్ పిలిస్తే తన ఫుల్ స్క్రిప్ట్ వినిపించాలని మురుగదాస్ భావిస్తున్నాడు. కానీ బన్నీ నుంచి పిలుపు మాత్రం లేదు. నిజానికి బన్నీకి అట్లీతో ఓ సినిమా చేయాలని ఉంది. జవాన్ హిట్టయితే వెంటనే.. అట్లీని లైన్ లో పెట్టాలని అనుకున్నాడు. ఎలాగూ జవాన్ అద్భుత విజయాన్ని సాధించింది. సో.. బన్నీ చూపు ఇప్పుడు అట్లీ వైపు పడింది. అయినా అల్లు అర్జున్ లో ఓ డైలామా ఉండ‌నే ఉంటుంది. ఎందుకంటే.. అట్లీ మాస్ దర్శకుడు. పైగా రెగ్యులర్ దర్శకుడు. ఇటు జ‌వాన్ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమానే. పాత సినిమాల‌న్నీ మిక్సీలో వేసి వచ్చిన సినిమా. కాబట్టి అట్లీ నుంచి కొత్తదనం రాదు. ఇక మురుగదాస్ విషయానికి వస్తే వినూత్న దర్శకుడు.

Also Read:ఖమ్మం కాంగ్రెస్‌లో బీసీ చిచ్చు..

పైగా మురుగదాస్ ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది. హిట్ ప్లాప్ ల సంగతి పక్కన పెడితే.. మురుగదాస్ లో మ్యాటర్ ఉంది. పైగా సాలిడ్ హిట్ కోసం మురుగదాస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అయితే ఇవన్నీ న‌మ్ముకొని మురుగదాస్ తో సినిమా తీయ‌డానికి అల్లు అర్జున్ సిద్దంగా లేడు. అలాగని వదులుకోవడానికి రెడీగా లేడు. మొత్తమ్మీద మురుగదాస్ ని న‌మ్మాలా, వ‌ద్దా? అనే మీమాంశ‌లో అల్లు అర్జున్ ఉండిపోయాడు. అయినా, అల్లు అర్జున్ వ‌ద్ద‌న్నా.. మురుగదాస్ కి పోయేదేం ఉండ‌దు. ఎందుకంటే.. తమిళ స్టార్ హీరో విజయ్ డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.

Also Read:ఐఐటీఏలో గ్రీన్ ఛాలెంజ్

- Advertisement -