డీజే దర్శకుడిపై బన్నీ ఫైర్‌….

233
Allu Arjun Fire On DJ Movie Director Harish Shankar
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ వేసవి కాలంలో దువ్వాడ జగన్నాదం సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. గత వేసవికాలంలో  వచ్చిన సరైనోడు బాక్స్‌ఫీస్‌వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే…. ఇక బన్నీకి సమ్మర్‌ సెంటిమెంట్‌ కలిసిరావడంతో ఈ సినిమాను కూడా వేసవికాలంలోనే విడుదల చేయాలని బన్నీ భావిస్తున్నాడట.

Allu Arjun Fire On DJ Movie Director Harish Shankar

అయితే ఈసిమాకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా కూడా లీక్‌ కాకుండా బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అదేవిధంగా ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను,టీజర్‌ను మహాశిరాత్రి సందర్భంగా విడుదల చేయడానికి దర్శకుడు హరీష్‌శంకర్‌ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. ఇది అంతా బాగానే ఉంది కానీ దర్శకుడు  హరీష్‌శంకర్‌పై బన్నీ సిరియస్‌ అయ్యాడట….దానికి కారణం మాత్రం టీజర్‌ ఎడిటింగ్‌ చేసిన విధానం బన్నీకి నచ్చలేదట.  ఈ సినిమా టీజర్‌ను అల్లుఅర్జున్‌కు చూపెడితే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీజర్‌ తన పాత్ర పూర్తిగా ఎలివేట్‌ కాలేదని బన్నీ సిరియస్‌ అయ్యాడట.

Allu Arjun Fire On DJ Movie Director Harish Shankar

ఈ మూవీలో అల్లు అర్జున్ ‘అదుర్స్’ సినిమాలో జూనియర్ చేసిన చారి పాత్ర తరహాలో నటిస్తున్న నేపధ్యంలో ఆ బ్రాహ్మణ పాత్ర బాడీ లాంగ్వేజ్ ని ‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్ లో హైలెట్ చేయమని అల్లు అర్జున్‌  హరీష్ శంకర్ ను ప్రత్యేకంగా కోరినట్లు టాక్.  దానికి అనుగుణంగా ట్రైలర్‌ లేక పోవడంతో బన్నీ దర్శకుడి మీద ఫైర్‌ అయ్యాడట. దీనితో హరీష్‌శంకర్‌ ఈ సినిమా ట్రైలర్‌విషయంలో మళ్ళీ మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డాడట. ఇదంతా చూస్తూంటే బన్నీ ఈసినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun Fire On DJ Movie Director Harish Shankar

తాజా ఊహాగానాల ప్రకారం, బన్నీ ఈ సినిమాలో పూర్తి విభిన్న లుక్ లో కనిపించనున్నాడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకర్స్ బ్యానర్‌పై మే 19న ఈసినిమా రిలీజ్‌ కానున్నట్లు సమాచారం.

- Advertisement -