ఆ అర్హత అల్లు అర్జున్ కి ఉంది

35
- Advertisement -

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ రావడం గురించి సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అరవింద్ కి ఎవర్ని ఎలా మ్యానేజ్ చేయాలో బాగా తెలుసు అని, అందుకే, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది అని పోస్ట్ లు పెడుతున్నారు. అసలు నేషనల్ అవార్డ్ కు అల్లు అర్జున్ కు అర్హత ఉందా ?, నటన విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని పాత అల్లు అర్జున్ కాకుండా నిజంగా పుష్ప అనే వ్యక్తి కనపడేలా నటించిన తీరు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఇక పుష్ప సినిమా కథ మీద కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. ఎంతసేపు ఎర్ర చందనం చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గూర్చి మాట్లాడుతున్నారు కానీ, ఒక వ్యక్తి తనను కాలి కింద అణగ దొక్కుతున్న వారిని ఎదురించి ఆత్మ గౌరవం కాపాడుకొని, వారితో సమాన స్థాయి కి ఎదిగిన వైనాన్ని ఎందుకు గమించడం లేదు ?, ఒక మంచి కథ అంటే ఏమిటి ?, మన ఎదుగుదలకు ప్రేరణగా నిలిచేదే కదా.

ఆ విషయంలో పుష్ప కథ ఎందులో తక్కువ ?, సరే అందరూ కామెంట్స్ చేస్తున్నట్లు.. సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ గొప్పది అని ఎక్కడైనా చెప్పారా ?, లేదు కదా. పైగా సరైన పోలీస్ ఆఫీసర్ తగిలినప్పుడు హీరో తప్ప అది చేసిన ప్రతి ఒక్కడు కుక్క చావుకు గురయ్యారు కదా. మరి ఆ పాయింట్ గురించి ఎందుకు ఎవరూ ఆలోచించడం లేదు ?, పైగా ఓ స్త్రీ లోలుడికి గుణపాఠం నేర్పింది ఒక మంచి విషయం కాదా ?, హీరో ఇంట్లోకి వెళ్లి హీరోయిన్ , హీరో తో మాట్లాడే సీన్ అయితే సినిమాకు ఒక హైలైటే కదా. తప్పు చేసే అవకాశం వచ్చినా హీరో పాత్ర తప్పు చేయలేదే !!, పైగా హీరో పాత్ర సాయం చేసింది. అన్నిటికీ మించి అప్పు ఇచ్చిన వ్యక్తిని ఇంటింటికీ తిప్పుతూ క్షమాపణ చెప్పించే సీన్ తప్ప , సినిమాలో ఇది వాస్తవ దూరం ఉంది అని చెప్పే సీన్ ఒక్కటి కూడా లేదు.

పుష్ప సినిమాలో చూపిన సంఘటనలు, వ్యక్తులు నిజ జీవితంలో కూడా ఉంటారు. బతుకు కర్కషత్వాన్ని , వ్యక్తుల కపట బుద్దిని, అమాయకుల దీన స్థితిని, కడుపు మండిన వాడి కసిని చూపిన చిత్రం ఇది. కూలీ పని చేసే వాడు కుర్చీలో కూర్చోవడమే సహించని సమాజాన్ని, ఒక వ్యక్తి ఇలా తప్ప వేరే విధంగా ఎదురించలేడు. సగటు సినిమా ఫార్ములా ను ఫాలో అయి పెట్టిన ఐటెం సాంగ్ లు మినహా మిగతా సినిమా సహజంగానే ఉంది. అందుకే నేషనల్ అవార్డుకి ఈ సినిమా ఎంపిక అయ్యింది. అందులో నటనకు గానూ అవార్డు వచ్చింది. కాబట్టి.. అల్లు అర్జున్ కచ్చితంగా అవార్డుకి అర్హుడు. మరి ఎన్టీఆర్ కి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. నిజమే.. ఎన్టీఆర్ కి కూడా భవిష్యత్తులో వస్తోందేమో చూద్దాం.

Also Read:హ్యాపీ బర్త్ డే…విశాల్

- Advertisement -