ఏపీలో భారీ వర్షాలు..సినీ ప్రముఖుల విరాళం

105
ntr
- Advertisement -

భారీ వర్షాలతో ఏపీలో పలు ప్రాంతాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం కాగా విపత్తు ప్రతిస్పందన దళం, మున్సిపాలిటీ కార్మికులు సహాయక చర్యల్లో 24 గంటలు పని చేస్తున్నారు.

ఇక వర్షాల కారణంగా చాలా మంది ఉపాధి కొల్పోగా తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు మందుకొచ్చారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తమవంతు సాయం చేయగా తాజాగా అల్లు అర్జున్ ముందుకొచ్చారు.

భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాల పాలవ్వడం తన మనసుని కలచి వేసిందని, వాళ్లకు తన తరపున సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టుగా ప్రకటించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఒక్కొక్కరూ 25 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించారు.

- Advertisement -