స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పవర్ఫుల్ ఎనర్జిటిక్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మించిన మూవీ`డీజే.. దువ్వాడ జగన్నాథమ్..కలెక్షన్లలో దుమ్మురేపుతోంది.
ఇదిలా ఉంటే..బన్నికీ టాలీవుడ్‌లోనే కాదు..మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అందుకే బన్నికి అక్కడ ఎలాంటి ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి ప్రతి సినిమా కేరళలో భారీ స్థాయిలో విడుదలవుతుంది.
బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ను కూడా మలయాళంలోకి తీసుకెళ్తున్నారు. తెలుగు వెర్షన్ విడుదలైన మూడు వారాలకు.. జులై 14న మలయాళంలో విడుదల చేయబోతున్నారీ చిత్రాన్ని. మలయాళంలోనూ ‘దువ్వాడ జగన్నాథం’ అనే పేరునే ఖరారు చేశారు.
పోయినేడాది అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ను కూడా తెలుగులో విడుదలైన తర్వాత కొంచెం లేటుగా ‘యోధవు’ పేరుతో కేరళలో విడుదల చేశారు. అంతకుముందు కూడా బన్నీ సినిమాలన్నీ తెలుగుతో పోలిస్తే ఆలస్యంగానే మలయాళంలోకి వెళ్లాయి.
కేరళలో బన్నీకి ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా తన సినిమాల డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు బన్నీ. హడావుడి లేకుండా టైం తీసుకుని డబ్బింగ్ పనులు చేయిస్తున్నాడు. ప్రమోషన్ కూడా కొంచెం గట్టిగా చేసి.. కేరళలో స్టార్ హీరోల సినిమాల స్థాయిలో తన సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఐతే ‘డీజే’కు తెలుగులో డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మలయాళ వెర్షన్ అక్కడి ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకర్షిస్తుందన్న సందేహలున్నాయి. పైగా ‘డీజే’ పరమ రొటీన్ సినిమా. కొత్త తరహా సినిమాలకు పట్టం కట్టే మలయాళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.