బీటౌన్‌ కి ఓకే చెప్పిన బన్నీ…

232
Allu Arjun Bollywood Entry
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కన్ను ఇప్పుడు బాలీవుడ్‌ పై పడింది. తెలుగు, తమిళంలో ఫుల్‌ క్రేజ్‌ సంపాధించుకున్న బన్నీ.. బీ టౌన్ (బాలీవుడ్‌ టౌన్‌) లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇన్నాళ్ళూ బన్నీ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్ నడుస్తూనే ఉంది. ఆ టాక్‌ ఇప్పుడు నిజమయ్యేలాగే కనిపస్తోంది.

 Allu Arjun Bollywood Entry

ఇక ఓ బయోపిక్‌ తో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అదికూడా లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌తో ఉంటుంద‌ని చెబుతున్నారు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా చిత్ర ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్..బయోపిక్ కి ప్లాన్‌చేశాడు.

Bollywood Top Director...ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ‌వీర్ సింగ్ పోషిస్తుండ‌గా, ఇండియ‌న్ క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో బ‌న్నీ న‌టిస్తాడ‌ని తెలుస్తోంది. కాగా..డైరెక్టర్‌..బ‌న్నీ పాత్ర‌ని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయ‌డంతో ఆ సినిమాలో న‌టించేందుకు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. 2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రం 83 అనే టైటిల్‌తో హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈసినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్నారు.

- Advertisement -