అల్లు అర్జున్‌పై ప్రశ్నల వర్షం!

3
- Advertisement -

పోలీస్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు అల్లుఅర్జున్. బన్నీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోమరించారు.చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. అల్లు అర్జున్ ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విచారణ సందర్భంగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయడంతో పాటు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. . సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది? , సంథ్య థియేటర్‌కు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా? , పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా?.. తెలియదా? , సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించనున్నారు.

మీరు గానీ, మీ పీఆర్ టీమ్ గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా? , సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా? , తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? , తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు? , ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు?, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు? చెప్పాలని అడగనున్నారు పోలీసులు.

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా? , రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించనున్నారు.

Also Read;ఒవైసీకి కోర్టు నోటీసులు

- Advertisement -