త్రివిక్రమ్ బన్నీ మూవీ టైటిల్ ఎంటో తెలుసా?

188
tri vikram bunny

మాటల మాంత్రికుడు త్రివిక్రమ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటివలే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈనెల 24 నుంచి ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్ధ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై అభిమానుల్లో భారీగా ఆశలు ఉన్నాయి.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తీయబోయే సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో అక్కినేని సుశాంత్ , నవదీప్ లు ప్రత్యేక మైన పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ బన్నీతో తెరకెక్కించిన రెండు సినిమాలు నాన్న సెంటిమెంట్ తో తెరకెక్కించినవే. ఈసినిమాను అమ్మ సెంటిమెంట్ తో ఉండనుందని ప్రచారం జరుగుతుంది.

ఈమూవీలో తల్లి పాత్ర చాలా ప్రాధాన్యతను సంతరించుకోవడం వల్లే టబును తీసుకున్నారట. తాజాగా ఈసినిమా టైటిల్ పై ఫిల్మ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈమూవీకి అలకనంద అనే టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తుంది. సినిమా ఎలాగు తల్లి కొడుకుల సెంటిమెంట్ కావడంతో అలకనంద అనే సెట్ అవుతుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. దసరా పండుగ సెలవుల్లో ఈమూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు.