మెగా హీరో అల్లు అర్జున్ ప్రేమించి స్నేహలతారెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో అందమైన జంటగా ఈ ఇద్దరని చెప్పుకోవచ్చు. ఈ అందమైన జంటకి అందమైన ఇద్దరు పిల్లలు. బన్నీ ఇప్పుడు ఈ అందమైన ఫ్యామిలీ పిక్ ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోలు సోషలో మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పోస్టు చేసిన కొద్దిసేపటికే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
ఇక బన్నీ తన భార్య పిక్ ని పోస్టు చేసి ‘ఇంత అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానా ‘ఓ మై గాడ్’ అంటూ సరదాగా క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రముఖ స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ స్నేహను అందంగా ముస్తాబు చేశారట. తన భార్యను ఉద్దేశిస్తూ బన్నీ చేసిన పోస్టుకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో మీది అందమైన జంట , మీరు ఇద్దరు మీ ఇద్దరికి ఇద్దరు మీ చిన్న ఫ్యామిలీ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బన్నీ ఇటీవలె ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా బాక్సీఫీస్ వద్ద ప్రభావం చూపలేదు. అయితే తన తరువాతి చిత్ర గురించి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్, విక్రమ్ కె కుమార్ లతో సినిమాలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ముందు ఏ దర్శకుడితో పట్టాలెక్కనున్నాడో చెప్పలేదు. చూడాలి మరి బన్నీ ఈ ముగ్గురిలో ఎవరికి పచ్చజెండా ఊపుతాడో.