ఆ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను: బన్నీ

53
- Advertisement -

జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న బన్నీ ప్రస్తుతం ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన ఫ్యాన్స్‌‌ను కలుసుకున్నారు. ‘భారత్‌లోని ఫ్యాన్స్ ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటారు. అది అనుభూతి చెందాల్సిందే. నేను వివరించలేను. అభిమానుల ప్రేమ నన్ను ఈ స్థాయిలో ఉంచింది. పుష్ప సినిమాలోని పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను.’ అని బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో చెప్పుకొచ్చారు. అలాగే అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌తో కొలాబరేట్ అయిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ విశేషాలు వెల్లడించారు. ఈ క్రమంలో బన్నీ.. సుకుమార్ స్క్రిఫ్ట్ గురించి చర్చించారు. దానిని స్క్రీన్ షాట్ తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ముందు అయితే నీకు షెకావత్‌కే గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది.’ అనే డైలాగ్ ఉంది. మొత్తానికి బన్నీ తనకు నేషనల్ అవార్డు వచ్చాక ఫుల్ ఖుషిలో ఉన్నాడు. తనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన పుష్పరాజ్ పాత్రను అందుకే బన్నీఅమితంగా ప్రేమిస్తున్నాడు.

Also Read:Prabhas:కల్కి రేట్ తెగేలా లేదు!

మరి ఈ పుష్ప 2 మూవీతో బన్ని ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరోవైపు బన్నీ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కథలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఓ ప్లాష్ బ్యాక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇక పుష్ప 2 లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.

- Advertisement -