రాములో రాముల సాంగ్.. బన్ని దోస స్టెప్ వేశాడంట

595
Allu Arjun Daughter
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో అల..వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తైంది. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించిన ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈమూవీ సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాస్ వచ్చింది. ఈసినిమాలోని రాములో రాములా సాంగ్‌కి హాఫ్ కోట్ వేసుకొని స్టెప్స్ వేశారు బ‌న్నీ. ఈ స్టెప్ బ‌న్నీ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈడ్యాన్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

కాగా అల్లు అర్జున్ వేసిన స్టెప్ ను దొశ స్టెప్ అని చెప్పింది బన్నీ కూతురు అర్హ. దోస వేసిన‌ట్టు ఇలా మొత్తం తిప్పుతావు బన్నీతో చెప్పింది. ఈవీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన కూతురితో సంభాషణను గతంలో కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈమూవీ డైలాగ్ తన కూతురితో చెప్పించాడు బన్నీ. ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చివ్ అని బన్నీ అనగా..ఇవ్వలేదు వచ్చింది అని అర్హ తన ముద్దు ముద్దు మాటలతో చెప్పింది. అర్హ మాటలకు మెగా అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

https://www.instagram.com/allusnehareddy/?utm_source=ig_embed

- Advertisement -