ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్హ

28
- Advertisement -

అల్లు అర్జున్ గారాలపట్టి ‘అల్లు అర్హ’కి సోషల్ మీడియాలో హీరో రేంజ్ క్రేజ్ ఉంది. పైగా, ఫాలోయింగ్ లో స్టార్ కిడ్స్ లో ప్రస్తుతం అర్హా టాప్ ప్లేస్ లో ఉంది. ఐతే, ఏడేళ్ల అర్హా పాప ‘శాకుంతలం’ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేసింది. సినిమాలో అల్లు అర్హ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులను మెప్పించడంలో అర్హ ముందు నుంచి యాక్టివ్ గానే ఉంది. అందుకే, కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావ్ ? నీ డ్రీమ్ ఏంటి ? అని అడిగితే.. దానికి అల్లు అర్హ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది.

‘నేను డాక్టర్ అవ్వను, అలాగే ఇంజనీర్ కూడా అవ్వాలని అనుకోవడం లేదు. ఖచ్చితంగా నేను యాక్టరే అవ్వాలని అనుకుంటున్నాను. అదే నా డ్రీమ్’ అంటూ కుండ బద్దలు కొట్టేసిందట. ‘అర్హ’ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. తన లేలేత పలుకులతో ముద్దు ముద్దు చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. చిన్న వయసులోనే తన తోటి కిడ్స్ లో తనకున్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అనిపించుకుంది. ఐతే, అల్లు అర్హ పాప బాలనటిగా మరో సినిమా చేయబోతుంది. దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్ర అది. ఇప్పుడు ఆ పాత్ర కోసం కొరటాల అర్హ పాపని తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ కుటుంబంతో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉండటంతో.. అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అర్హ నటిగా బిజీగా మారుతుంది.

Also Read:హ్యాపీ బర్త్ డే..ఐష్

- Advertisement -