అల్లు బాబీ బ్యాన‌ర్ లో వ‌రుణ్ తేజ్..

467
varun tej allu bobby
- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం అంత‌రిక్షం. ఈమూవీ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈమూవీకి క్రిష్ మ‌రియు రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈమూవీ పాజీటివ్ టాక్ తో దూసుక‌పోతుంది. ఈమూవీతో పాటు ఆయ‌న మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 2 మూవీలో నటిస్తున్నారు.విక్టరీ వెంక‌టేష్ , వ‌రుణ్ తేజ్ ఈమూవీలో న‌టిస్తున్నారు.

antariskham

ఈమూవీ సంక్రాంతికి విడుద‌ల కానుంది. తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు వ‌రుణ్ తేజ్. అల్లు అర‌వింద్ పెద్ద‌బ్చాయి బాబీ సొంతంగా ఒక ప్రొడ‌క్ష‌న్ హోస్ ను ప్రారంభించాడు. ఆయ‌న బ్యాన‌ర్లో మొట్ట‌మొద‌టి సినిమా వ‌రుణ్ తేజ్ తో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.కిరణ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ‘కంచె’ .. ‘అంతరిక్షం’ మాదిరిగానే వరుణ్ తేజ్ కెరియర్లో ఈ సినిమా విభిన్నమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెల‌యజేయ‌నున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -