మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భోళా శంకర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం జరుగగా ఈ వేదికపై షాకింగ్ కామెంట్స్ చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. తాను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ గురించి చెప్పడానికి కాదని…ఎందుకంటే ఆయన చూడని హిట్స్ లేవు అన్నారు.
మీరు ఆయన సినిమాలు చూస్తూ అభిమానులు అయ్యి ఉంటారు… కానీ నేను ఆయనతో సినిమాలో చేస్తూ అభిమానిని అయ్యాను. ఆ అభిమానం ఎలాంటిది అంటే.. ఆయనపై తప్పుడు మాటల మాట్లాడినందుకు వాళ్ళని జైలుకి పంపించేందుకు 12 ఏళ్ళు పాటు పోరాడాను. అది నా అభిమానం అని వెల్లడించారు.
Also Read:అధికారిక లాంఛానాలతో గద్దర్ అంత్యక్రియలు..
2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఆ వివాదాస్పద వ్యాఖ్యల పై నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దాదాపు 12 ఏళ్ళ పాటు ఈ కేసు పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Also Read:పొత్తుకు పవన్ వెనుకడుగు.. కారణం అదే?